లక్నో: కొద్ది రోజుల క్రితమే సన్యాసినిగా మారి మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (52)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేసినట్టు చెప్పారు. పలువురు మత పెద్దలు, అఖాడాల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖాడా పెద్దలు తెలిపారు.
ఆమెను అఖాడాలో చేర్పించిన కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠీని సైతం అఖాడా నుంచి తప్పించారు. మమతా కులకర్ణి.. అఖాడాలో చేరిన తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. అఖాడాలో అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను చేరగానే ఆమెకు కట్టబెట్టడాన్ని పలువురు వ్యతిరేకించారు.