న్యూఢిల్లీ : వైరల్ కోక్ స్టూడియో భారత్ సాంగ్ ఖలాసికి (Viral Video) కంటెంట్ క్రియేటర్లుగా పేరొందిన అన్నా చెల్లెళ్లు కిలీ, నీమా పాల్ కాలు కదిపారు. ఈ సాంగ్‌తో వీరు తమ ఫ్యాన్స్, ఫాలోయర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 12న ఈ షార్ట్ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ…ఈ అందమైన గుజరాతీ సాంగ్‌ను ఎంజాయ్ చేయండని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. గుజరాతీ గాయకులు ఆదిత్య గధ్వి, అచింత్ టక్కర్లు ఆలపించిన ఈ పాటను కోక్ స్టూడియో భారత్ ఈ ఏడాది జులైలో విడుదల చేసింది.
ఈ షార్ట్ క్లిప్‌లో కిలీ, నీమా పాల్ ఖలాసీ సాంగ్‌కు లిప్ సింకింగ్ ఇస్తూ స్టైలిష్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పటివరకూ ఏకంగా 4.6 లక్షల వ్యూస్‌ను రాబట్టింది. ఇక ఖలాసి సాంగ్‌కు యూట్యూబ్‌లో 6.3 లక్షల వ్యూస్ దక్కాయి. ఇన్స్టాగ్రాంలోనూ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్‌ను వాడుతూ పెద్దసంఖ్యలో నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు.
Read More :
Diwali 2023 | సందడంతా మాదే.. సెలబ్రెటీలు పంచుకున్న దీపావళి ముచ్చట్లు..