IND vs PAK : పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Difence) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) తలపొగరు వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతి భ్రమించిందని, అందుకే ఏవేవో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఇటీవల ద్వీపదేశం సీషెల్స్‌లో పర్యటించిన ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi).. ఆ దేశ అత్యున్నత ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ (Guardian of the Blue Horizon)’ పురస్కారం అందుకున్నారు.
దీనిపై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అది రూపొందించుకున్న గౌరవం (కావాలని ఇప్పించుకున్న అవార్డు) అని వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆయనకు పనేం లేదని, అవగాహనలేని అంశాలపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడని వ్యాఖ్యానించింది. మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కౌంటర్ ఇచ్చారు. ఇతరులపై అసూయ ఎప్పటికీ మంచి చేయదని, చెడును ప్రేరేపిస్తుందని అన్నారు.
ముఖ్యంగా విద్వేషపూరిత ప్రసంగాలకు అలవాటు పడినవారిలో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు. మోదీ పర్యటనకు కొద్ది వారాల ముందే అంటే జూన్ 24న గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారానికి అక్కడి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.