కలబురిగి: కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్లకు హితవు పలికారు.
ఇరువురు దూరంగా ఉంటూ, వేర్వేరు దిశల్లో పయనిస్తే, అభివృద్ధి సాధించడం కష్టమవుతుందన్నారు. కల్యాణ పథ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు. అభివృద్ధి చేయడాన్ని ఉపేక్షిస్తే, ప్రజలు మనల్ని ఇష్టపడరని హెచ్చరించారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే ఈ హిత వచనాలు పలికారు.