Kerala CM : పాఠశాలల్లో కరిక్యులం (School curriculam) ఎంపికచేసే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని కేరళ సీఎం (Kerala CM) వీడీ సతీశన్ (VD Satheeshan) పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం (Union Govt) జోక్యం చేసుకోకూడదని అన్నారు. కేంద్రం రూపొందించిన పీఎం శ్రీ (PM Shri) పథకాన్ని పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కూడిన ఉపకమిటీ (Sub Committee) ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విలేకరులతో చెప్పారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు పాఠశాలలను ఎంపిక చేసే విషయంలో కూడా రాష్ట్రానికే స్వేచ్ఛ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.99 కోట్లు అందాయని తెలిపారు. దీని అమలుకు గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన నిధులను కూడా ఆ ప్రభుత్వమే తీసుకుందని అన్నారు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.