హైదరాబాద్: కేరళలో కరోనా మహమ్మారి ( Corona virus ) ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ప్రతిరోజూ 25 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 25,772 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, కొత్తగా 27,320 మంది కరోనా బాధితులు ఆ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రికవరీల 39,93,877కు చేరింది. కొత్తగా ఇవాళ 189 మంది కరోనా బాధితులు మరణించడంతో మృతుల సంఖ్య 21,820కి పెరిగింది.
అయితే, కేరళలో ఒకవైపు పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ జరిగిన కొవిడ్-19 రివ్యూ మీటింగ్లో.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతోపాటు, ఆదివారం లాక్డౌన్ను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు వెల్లడించారు.