తిరువనంతపురం: కేరళలో కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల ( Corona in Kerala ) సంఖ్య భారీగా తగ్గింది. ఎన్నో రోజులుగా ఐదు వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా ఇవాళ ఆ సంఖ్య భారీగా పడిపోయింది. ఇవాళ కేవలం 3,698 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే రెట్టింపు సంఖ్యలో 7,515 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 50,12,301కి పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా మునుపటితో పోల్చుకుంటే తక్కువగానే నమోదయ్యాయి. ఇవాళ 75 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 37,675కి చేరింది. ప్రస్తుతం అక్కడ 54,091 యాక్టివ్ కేసులు ఉన్నాయి.