తిరువనంతపురం: కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ‘ప్రియదర్శిని’ పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టింది. దీని కారణంగా తాము తీవ్ర ఆర్థిక నష్టల్లో కూరుకుపోతున్నామంటూ కేరళలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు జూలై 20 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.
ఈ పథకంలో భాగంగా మూడు వేలకుపైగా కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల తమ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోయిందని, ఫలితంగా ఆదా యం కుంటుపడిందని ప్రైవేట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.