Gulf Bank | న్యూఢిల్లీ: కువైట్ ఆరోగ్య శాఖలో పనిచేసిన కేరళ నర్సులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. వాళ్లు కువైట్కు చెందిన ‘గల్ఫ్ బ్యాంక్’ నుంచి దాదాపు రూ.700 కోట్ల రుణం తీసుకొని ఉడాయించినట్టు కేరళలో ఫిర్యాదు నమోదైంది.
1,425 మంది మలయాళీలు 2020 నుంచి 2022 మధ్య కాలంలో గల్ఫ్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని ఆ దేశాన్ని వీడారు. ఈ నేపథ్యంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ కేరళకు చేరుకొని ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.