మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు. నిర్ధిష్ట ఫిర్యాదులతో ఎవరైనా ముందుకు వస్తే చట్టం తన పని తాను చేస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాజ్‌భవన్‌కు ఈ దిశగా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని చెప్పారు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వేళ్లూనుకున్న తీరును కండ్లకు కట్టింది. ఆ కమిటీ రిపోర్టును ప్రభుత్వం ఇటీవల వెల్లడించగా సినీ పరిశ్రమలో ఈ జాఢ్యం ఎలాంటి వెర్రితలలు వేస్తోందో బయటి ప్రపంచానికి బహిర్గతం చేసింది.
సినీ పరిశ్రమలో వివిధ దశల్లో నియామకాల కోసం ‘కాంప్రమైజ్’, ‘అడ్జస్ట్మెంట్స్’ అనే పదాలను పాస్వర్డులుగా వాడుతున్నట్లు కమిటీ నివేదిక తెలిపింది. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వాళ్లకు ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న వాళ్లు ఇచ్చే సంకేతం ఇది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఏ స్దాయిలో ఉందో ఇది వెల్లడిస్తోంది. ఇక హేమ కమిటీ తన నివేదికను సమర్పించిన నాలుగున్నరేండ్ల అనంతరం కేరళ ప్రభుత్వం ఆ నివేదికను విడుదల చేసింది.
Read More :
Telangana Journalists | మాపై దాడులు ఆపండి.. రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల నిరసన