కొచ్చి: ఎయిర్‌పోర్టుల్లో స్మగ్లింగ్ గూడ్స్ పట్టుబడటం అనేది నిత్యకృత్యంగా మారింది. బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులు తరలిస్తూ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, ఫోన్లు పట్టుబడ్డాయి. దుబాయ్ నుంచి ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు కొచ్చి ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
వారి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకుని తనిఖీ చేశారు. వారి నుంచి రూ.73 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ముగ్గురిని అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు.