Kerala gold smuggling case: ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ జైలు నుంచి విడుదల
Kerala gold smuggling case: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ జైలు నుంచి విడుదలైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నేరం కింద

కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ జైలు నుంచి విడుదలైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నేరం కింద స్వప్న సురేష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత ఏడాది జూలైలో అరెస్ట్ చేసింది. ఇటీవల ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నవంబర్ 2న కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల బాండు, ఇద్దరి పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది.
స్వప్న సురేష్‌ను 2020, జూలై 11న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి 16 నెలలుగా ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నది. కాగా, కేరళలో దౌత్య మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణా జరిగింది. అదే క్రమంలో 2019, జూలై 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో రూ.14.82 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారం పట్టుబడింది. దౌత్యపరమైన పార్శిల్ పేరుతో తరలిస్తున్న బ్యాగేజీపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు చెక్ చేయడంతో బండారం బయటపడింది.
ఈ కేసులో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), కస్టమ్స్ డిపార్టుమెంట్ విచారణ జరుపుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

