తిరువనంతపురం: కేంద్ర ఆర్థిక విధానాలపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మండిపడ్డారు. ఆ విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రావటం లేదు. పన్ను తగ్గించినా ఫలితాన్ని ప్రజలకు ఇవ్వట్లేదు. కానీ, కార్పొరేట్లకు దోచి పెడుతున్నది. ఈ రోజు దేశంలోని రాష్ర్టాలు పంచాయతీలపైనా అధికారం కోల్పోయాయి’ అని వెల్లడించారు. పన్ను వసూళ్ల పేరుతో రాష్ర్టాల ఫెడరల్ అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.