తిరువనంతపురం: కేరళ అధికార పార్టీ సీపీఎం నేత సయ్యద్ అలీ మజీద్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తాను విజయం సాధించిన సందర్భంగా ఆయన మలప్పురం జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఎన్నికల బరిలో మహిళలను నిలిపిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే భర్తల దగ్గర పడుకుని, పిల్లల్ని కనవలసిన వారని, ఎన్నికల్లో కవాతులు చేయవలసిన వారు కాదని అన్నారు.