మలప్పురం : 11 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ జంటకు కేరళలోని ఓ పోక్సో కోర్ట్ బుధవారం 180 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు ఇద్దరికీ రూ.11.75 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిందితులకు విధించిన జరిమానాను బాధితురాలికి అందజేస్తారు.
బాధితురాలి తల్లి భర్తను వదిలేసి, 2019లో ప్రియుడితో మలప్పురం పారిపోయింది. బాలికను కూడా తీసుకెళ్లింది. ఆ తర్వాత రెండేండ్ల పాటు ఆమె ప్రియుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి లైంగిక వేధింపులకు బాధితురాలి తల్లి సహకరించింది.