Kerala | కొచ్చి, ఏప్రిల్ 6: లక్ష్యాలు పూర్తి చేయలేదని పేర్కొంటూ మెడలో పట్టీవేసి కుక్క మాదిరిగా ఉద్యోగులను నడిపించడమే కాక, నేలపై నాణేలను నోటితో తీయించిన అమానుష ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా, పెరుంబవూర్లో ఓ మార్కెటింగ్ కంపెనీ ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది.
అయితే అలాంటి శిక్షలు ఉన్నాయని కొందరు నిర్భయంగా వెల్లడించగా, మరికొందరు లేవని పేర్కొనడం గమనార్హం. పనితీరు బాగా లేని ఉద్యోగులను శిక్షించడానికి తమ కంపెనీ వారిని కుక్కలా నడిపించడం, నేలపైన నాణేలను నోటితో తీయించడం లాంటి అవమానకర, అమానుష పద్ధతులను ప్రయోగిస్తున్నదని కొంతమంది ఉద్యోగులు ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది.