CM Pinarayi Vijayan | చెన్నై: ప్రతిపాదిత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను రాష్ర్టాల మెడపై వేలాడుతున్న కత్తిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. తమ జనాభాను తగ్గించుకున్న దక్షిణాది రాష్ర్టాలు ముఖ్యంగా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయని అన్నారు. జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడానికి ముందు అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎటువంటి సంప్రదింపులు లేకుండా కేంద్రం హఠాత్తుగా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళుతోందని విజయన్ చెప్పారు. రాజ్యాంగ సూత్రాలు, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.