తిరువనంతపురం: అంగన్ వాడీ కేంద్రంలో అందించే ఆహారంలో తనకు ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని ఓ కేరళ చిన్నారి ముద్దుగా చేసిన అభ్యర్థన అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. కేరళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అతడి విజ్ఞప్తిపై స్పందిస్తూ మెనూలో బిర్యానీని చేర్చే విషయాన్ని పరిశీలిస్తాన్నారు.
‘అంగన్వాడీ కేంద్రంలో నాకు బిర్నానీ (బిర్యానీ), పొరిచ కొజి(చికెన్ ఫ్రై) కావాలి’ అని త్రజుల్ ఎస్ శంకర్ అనే బాలుడు చేసిన అభ్యర్థనను అతడి తల్లి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. శంకర్ అభ్యర్థనకు మద్దతు పలికారు.