బడంగ్పేట్, జనవరి 29 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి రెవె న్యూ పరిధిలోని ఓ గుట్టను మింగేందుకు అధికార పార్టీ నేతలు పెద్దస్కెచ్ వేశారు. 17 ఎకరాల విస్తీర్ణంలోని దాదాపు రూ.200 కోట్ల గుట్టను బుల్డోజర్లతో తవ్వేస్తూ చదును చేస్తున్నారు. అధికారులు అక్కడ ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డు పెట్టినా దాన్ని తొలగించి మరీ దర్జాగా గుట్టను తవ్వేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారమంతా అధికార పార్టీ సీనియర్ నేత వెను క ఉండి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేగా క అడ్డుకునేందుకు యత్నిస్తున్న అధికారులపైనా ఆ నేత ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో దాదాపు 17 ఎకరాలకు పైగా గుట్ట ఉన్నట్టు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఉండటంతో ఎకరం భూమి దాదాపు రూ.10 కోట్లకు పైగానే పలుకుతున్నది. మొత్తం భూమి దాదాపు రూ.200 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ గుట్టపైకి మొదట మట్టి కోసం వచ్చినట్టుగా నటించి, తర్వాత రాళ్లను తొలిచి తరలించారు. తర్వాత ఏకంగా బుల్డోజర్లు పెట్టి గుట్టను కొల్లగొట్టి వెంచర్‌కు ప్లాన్ చేశారు. బాలాపూర్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో ఆర్ఐ జమీల్ తదితరులు అక్కడ ‘ఇది ప్రభుత్వ భూమి’ అని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను రాత్రికిరాత్రే తొలగించి తిరిగి చదును చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.
బాలాపూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జల్పల్లిలోని సర్వే నంబర్ 177లో ప్రభుత్వ భూమి దాదాపు 17 ఎకరాలకు పైగా ఉన్నది. సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయించేందుకు గుట్టలు కావడంతో కొంత ఇబ్బంది అవుతున్నది. ఆ స్థలంలో ప్ర సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాం. తర్వాత కొంతమంది బోర్డులు తొలగించారు. ఎవరు తొలగించారో తెలుసుకుంటాం. కబ్జాదారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. గుట్ట చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తాం.