Coldrif Cough Syrup : మధ్యప్రదేశ్‌లో ఆరుగురు చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందుపై కేరళ (Kerala) ప్రభుత్వం కొరడా ఝులిపించింది. తమ రాష్ట్రంలోనూ కోల్డ్రిఫ్ సిరప్(Coldrif Cough Syrup) అమ్మకాలపై నిషేధం విధించింది. చిన్నారుల పాలిట ప్రాణాపాయంగా పరిణమించిన ఈ దగ్గుమందు అమ్మకాలపై సత్వరమే నిషేధం అమల్లోకి వస్తుందని శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా గార్గ్ (Veena Garg) వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తిరువనంతపురంలో మంత్రి తెలిపారు.
‘రాష్ట్రంలో కోల్డ్రిఫ్ సిరప్ పంపిణీని అడ్డుకోవాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కేరళలో ఎనిమిది మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ మందును సరఫరా చేస్తున్నారు. ఈ రోజు నుంచి కోల్డ్రిఫ్ సిరప్ అమ్మకాలు, పంపిణీపై నిషేధం వర్తిస్తుందని వాళ్లకు తెలియజేశాం. మెడికల్ షాపులలో ఈ మందు ఉంటే వాళ్లు తక్షణమే దానిని తొలగించాలని కోరాం’ అని మంత్రి వీణా గార్గ్ వివరించారు.
The ‘Poisonous’ Cough Syrup Probe
Kerala has decided to stop the sale of this syrup. The state’s Drugs Control Department has launched intensive inspections and imposed a ban on its sale.@ArpithaAja10359 shares more details with @HeenaGambhir pic.twitter.com/ypKJFej6xY
— TIMES NOW (@TimesNow) October 4, 2025
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దాదాపు పక్షం రోజుల్లోనే ఆరుగురు పిల్లలు మూత్రపిండాల పనితీరు దెబ్బతిని మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దగ్గు సిరప్ తాగడం వల్లే ఆ చిన్నారులు మృతి చెందడం తీవ్ర దుమారం రేపింది. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కోల్డ్రిఫ్ సిరఫ్ అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించింది.
#WATCH Rewa: Madhya Pradesh Deputy Chief Minister Rajendra Shukla says, “In Chhindwara, a report was received late last night regarding Coldrif syrup company, which was sent for testing on October 1. The received report found 48% toxic substances…A letter has been written to… pic.twitter.com/RyFQWkDWsX
— ANI (@ANI) October 4, 2025
కొల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారీ కర్మాగారం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. అందుకని మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయంలో దర్యాప్తు చేయాలని తమిళనాడు సర్కారును కోరింది. ఇందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందడంతో సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. పిల్లల మృతి వార్త వెలుగులోకి వచ్చాక ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. చింద్వారాలోని పరాసియా బ్లాక్‌లో దాదాపు 15రోజుల్లో తొమ్మిది మంది పిల్లలు కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు చికిత్స తీసుకుంటున్నారు. ఆ సిరప్‌లో నాన్-ఫార్మాకోపోయియా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్‌ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.
🚨Tamil Nadu bans ‘Coldrif’ cough syrup after child deaths in MP, Rajasthan. pic.twitter.com/UT009qmrBx
— Indian Infra Report (@Indianinfoguide) October 4, 2025
మూత్రపిండాలకు హాని కలిగించే విషపూరిత పదార్థాలైన డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమైనట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నివేదిక తర్వాత తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కోల్ట్రిఫ్ సిరప్ అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో స్టాక్‌ను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి ఉత్పత్తిని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.