న్యూఢిల్లీ, జూన్ 1: మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 5న తీర్పు వెల్లడిస్తామని స్థానిక ప్రత్యేక కోర్టు వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సుప్రీంకోర్టు గత నెల 12న కేజ్రీవాల్‌కు 21 రోజుల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈ నెల 2న లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆదివారం కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉన్న నేపథ్యంలో శనివారమే బెయిల్ పిటిషన్‌పై తీర్పునివ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభ్యర్థనను ప్రత్యేక కోర్టు జడ్జి తిరస్కరించారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరును ఈడీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు.