న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ మెట్రో రైళ్లు, స్టేషన్లలో కొన్ని హెచ్చరికలు, నినాదాలను రాశారు. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్రో డిప్యూటీ పోలీస్ కమిషనర్ జీ రామ్ గోపాల్ నాయక్ సోమవారం తెలిపారు. ఈ రాతల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆప్ కోరింది. ఈ రాతల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అకౌంట్‌ను గుర్తించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.