థర్డ్ వేవ్ : ప్రాణవాయువు కొరత లేకుండా చేద్దాం!

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్‌ను ఆప్ నేతలు తోసిపుచ్చారు. ఇక థర్డ్ వేవ్ తలెత్తితే ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆక్సిజన్ కోసం మన పోరాటం ముగిసిందని భావిస్తే థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ లేకుండా ఏ ఒక్కరూ బాధపడకూడని పరిస్ధితిని కల్పించేలా మనం కసరత్తు సాగించాలని ఢిల్లీ సీఎం పిలుపు ఇచ్చారు.
సెకండ్ వేవ్‌లో పెద్దసంఖ్యలో కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడగా, థర్డ్ వేవ్‌లో ఇలాంటిది జరగరాదని అన్నారు. మనలో మనం కీచులాడుకుంటే కరోనా విజయం సాధిస్తుందని, మనం కలిసికట్టుగా పోరాడితే మహమ్మారి తోకముడిచి దేశం గెలుస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ముమ్మర దశలో ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగింతలు అధికంగా చూపిందని సుప్రీంకోర్టు నియమించిన ఆడిట్ కమిటీ నివేదిక పేర్కొనడం కలకలం రేపింది. ఢిల్లీ తీరుతో ఆ సమయంలో అత్యధిక కేసులు వెలుగుచూసిన 12 రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాల్లోతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

