న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం మరోమారు ఎదురురెబ్బ తగలింది. బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. రిజాయిండర్ వేసేందుకు కేజ్రీవాల్‌కు రెండ్రోజుల సమయం ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు తమకు అనుమతి లభించినట్టు సీబీఐ తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: స్నాతకోత్సవాల్లో ధరించడానికి ఆయా రాష్ట్ర సంప్రదాయాలకు సరిపడేలా భారత సంప్రదాయాలకు అనుగుణంగా తగిన దుస్తుల కోడ్‌ను రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అధీనంలోని సంస్థలను కోరింది. వలస వారసత్వంగా ప్రస్తుతం ధరిస్తున్న టోపీతో ఉన్న నల్ల దుస్తులను మార్చాల్సిన అవసరం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఐరోపాలో మధ్య యుగాలలో ఉద్భవించిన దానిని బ్రిటీష్ వారు మనదేశంలో ప్రవేశపెట్టగా అదే వారసత్వంగా వస్తున్నదని తెలిపింది.