న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పురోగమిస్తుందన్నారు. ‘ఈ వ్యక్తులు సీబీఐ-ఈడీ ఆడుతూ ప్రభుత్వాలను పడగొట్టడంలో బిజీగా ఉంటే.. ప్రజలు తమ సమస్యల గురించి ఎవరితో మాట్లాడుతారు’ అన్నారు. ‘రూపాయి పడిపోతోంది. ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. ఈ వ్యక్తులు సీబీఐ-ఈడీ ఆడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడంలో, రోజంతా వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు మధ్యే పోటీ ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం పేర్కొన్నారు. ప్రజలు మోడీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్‌ను చూస్తున్నారన్నారు.