న్యూఢిల్లీ : ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సరికొత్తగా రూపొందించిన ‘వందే మాతరం’ గేయం గణతంత్ర దినోత్సవాల్లో మారుమోగింది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సోమవారం జరిగిన కవాతులో ఆయన నేతృత్వంలో దాదాపు 2,500 మంది కళాకారులు ఈ గేయాన్ని ఆలపించారు.
ఈ ‘వందే మాతరం’ గేయం ఆహూతుల్లో భావోద్వేగాన్ని నింపింది. విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఈ ప్రదర్శన జరిగింది. గణతంత్ర దినోత్సవ కవాతుకు సంగీతం సమకూర్చడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కీరవాణి ఎక్స్ వేదికగా చెప్పారు.