డెహ్రాడూన్: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్(Kedarnath)లో.. ట్రెక్కింగ్ రూట్‌ను మళ్లీ ఓపెన్ చేశారు. 15 రోజుల మూసివేత తర్వాత ఆ మార్గాన్ని రీఓపెన్ చేశారు. జూలై 31వ తేదీ రాత్రి భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో.. ఆ రూట్‌ను మూసివేశారు. 19 కిలోమీటర్ల మార్గంలో.. సుమారు 29 ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ రూట్‌ను పూర్తిగా శుక్రవారం క్లియర్ ఛేశారు. ట్రెక్కింగ్ దారిని క్లియర్ చేసేందుకు సుమారు 260 మంది కార్మికులు రాత్రీపగలూ పనిచేసినట్లు ఓ అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం కేదార్నాథ్ నడకదారి రూట్లో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. అయితే ఆ ప్రదేశాల్లో యాత్రికులకు భద్రతా సిబ్బంది హెల్ప్ చేస్తున్నారు. కొండచరియిలు విరిగిపడిన రోజున కేదార్‌నాథ్‌లో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. భారతీయ వైమానిక దళం, ప్రైవేటు హెలికాప్టర్లతో సుమారు 11వేల మంది యాత్రికులను రక్షించారు. భీంభలి, లించోలీలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సురక్షితంగా తరలించాయి.
श्री केदारनाथ धाम पैदल मार्ग 15 दिन बाद आवाजाही के लिए खुला। आप भी कीजिए बाबा केदारनाथ के प्रभात दर्शन #kedarnath #kedarnathtemple #chardhamyatra2024 #rain pic.twitter.com/bNU5GPt2OS
— DM Rudraprayag (@DmRudraprayag) August 17, 2024