Railway Minister | కాజీపేటలో త్వరలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభం : రైల్వే మంత్రి
Railway Minister | కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తికావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందని తెలిపారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై ఆయన ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు.
Railway Minister : కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తికావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందని తెలిపారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై ఆయన ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ తయారయ్యే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయని అన్నారు. ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయని అన్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైళ్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుందని అన్నారు. రైలు బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే ఆధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

