మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:04:52

కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా ఇవ్వాలి

కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా ఇవ్వాలి

  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా సాధించేందుకు పోరాడుతామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రకటించారు. రాష్ట్రహోదాను, 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 370 ఆర్టికల్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గతేడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగించి జమ్ముకశ్మీర్‌, లఢక్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేశారు. logo