Karti Chidambaram | టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు..ఇది ఇంకా మూడవ రోజే.. : సీబీఐ విచారణపై కార్తీ చిదంబరం
వీసా కోసం ముడుపుల కేసులో దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు బదులిచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం వరుసగా మూడోరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు.2011లో తన తండ్రి పీ చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు జారీ చేశారనే కేసులో కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ : వీసా కోసం ముడుపుల కేసులో దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు బదులిచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం వరుసగా మూడోరోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు.2011లో తన తండ్రి పీ చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు జారీ చేశారనే కేసులో కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కార్తీ చిదంబరం మాట్లాడుతూ టెస్ట్ మ్యాచ్ ఐదురోజుల పాటు జరుగుతుంది..ఇది (విచారణ) మూడో రోజని వ్యాఖ్యానించారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని తాను స్పీకర్‌కు లేఖ రాశానని, స్సీకర్ స్పందన కోసం వేచిచూస్తున్నానని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులను ఉల్లంఘించేలా దర్యాప్తు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కార్తీ చిదంబరం స్పీకర్‌కు రాసిన లేఖలో వివరించారు. ఇక ఈ కేసులో కార్తీ చిదంబరానికి, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్‌కు రూ 50 లక్షల ముడుపులు ముట్టాయని తాజా కేసులో సీబీఐ కార్తీ చిదంబరం ఇతరులపై మే 14న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

