బెంగళూరు: కన్నడ భాషలో రాయడానికి కర్ణాటక మంత్రి ఇబ్బందిపడ్డారు. శుభాకాంక్షలు అన్న పదాన్ని కన్నడలో రాసేందుకు గందరగోళానికి గురయ్యారు. ఆ పదాన్ని తొలుత తప్పుగా రాశారు. చివరకు పక్కనున్న వారి సహాయంతో అక్షర దోషాలను సరిచేశారు. (Kannada Minister struggles to write the language) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కన్నడ కాంగ్రెస్ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. కొప్పల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కన్నడ భాష, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి పాల్గొన్నారు. కరటగి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి బోర్డుపై కన్నడలో ‘శుభవాగలి’ అంటే శుభాకాంక్షలు అని రాయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. తొలుత కన్నడ అక్షరాలను తప్పుగా రాశారు. అయితే ఆయన పక్కన ఉన్న వారు చెప్పడంతో అక్షర దోషాలను సరిచేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో శుభాకాంక్షలు అన్న సాధారణ పదాన్ని కూడా కన్నడ భాషలో మంత్రి శివరాజ్ తంగడగి రాయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడ భాష, సాంస్కృతిక శాఖకు ఇలాంటి మంత్రిని నియమించిన సీఎం సిద్ధరామయ్యపై కొందరు మండిపడ్డారు.
మరోవైపు కర్ణాటక బీజేపీ కూడా దీనిపై విమర్శలు గుప్పించింది. కన్నరామయ్య ప్రభుత్వం కన్నడను కూనీచేస్తోందని ఆరోపించింది. ‘విద్యా శాఖ మంత్రి మధు బంగారప్పకు కన్నడలో చదవడం, రాయడం రాదు. కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి ఒక సాధారణ పదాన్ని కన్నడలో రాయడానికి చాలా ఇబ్బంది పడ్డారు’ అని ఎద్దేవా చేసింది.
ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ಸಚಿವರಾದ ಶಿವರಾಜ್ ತಂಗಡಗಿ ಅವರು “ಶುಭವಾಗಲಿ” ಪದ ಬರಿಯೋಕೆ ಕಷ್ಟಪಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ ಈಗ ವೈರಲ್ ಆಗುತ್ತಿದೆ. pic.twitter.com/UHqaljNxlQ
— Belagavi – ಬೆಳಗಾವಿ (@BelagaviKA) February 1, 2025
ಕನ್ನರಾಮಯ್ಯ ಸರ್ಕಾರದಿಂದ ಕನ್ನಡದ ಕಗ್ಗೂಲೆ
ಕನ್ನಡ ಓದಲು ಬರೆಯಲು ಬಾರದ ಅನಕ್ಷರಸ್ಥ ಶಿಕ್ಷಣ ಸಚಿವ @Madhu_Bangarapp ಒಂದು ಕಡೆಯಾದರೆ, ಕನ್ನಡದ ಸುಲಭವಾದ ಪದವನ್ನು ಬರೆಯಲು ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಸಚಿವ @sstangadagi ವಿಲ ವಿಲ ಒದ್ದಾಡಿದ್ದಾರೆ.
ಅನಕ್ಷರಸ್ಥರ ದೊಡ್ಡಿಯಾಗಿರುವ @INCKarnataka ಸರ್ಕಾರ ಕನ್ನಡದ ಅಸ್ಮಿತಿಗೆ ಕೊಳ್ಳಿ… pic.twitter.com/BrCXTJxaf3
— BJP Karnataka (@BJP4Karnataka) February 2, 2025