Bus Driver | ముస్లింలు నమాజ్ (namaz)కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమాజ్ వేళకు ప్రార్థనలు చేసుకుంటారు. అలా డ్యూటీలో ఉన్న ఓ డ్రైవర్ (Bus Driver) నమాజ్ చేసుకునేందుకు బస్సు ఆపి అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది.
ఈనెల 29న హుబ్బళ్లి టు హవేరి మధ్య నడుస్తున్న కేఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు డ్రైవర్ ప్రయాణ సమయంలో నమాజ్ కోసం బస్సును మధ్యలోనే ఆపేశాడు. ఆ వ్యక్తి బస్సులోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఈ కారణంగా బస్సు టైమ్‌కు గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ బస్సులో నమాజ్ చేసుకుంటున్న దృశ్యాలను బస్సులోని కొందరు ప్యాసింజర్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి అధికారుల దృష్టికి చేరింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు.. సదరు డ్రైవర్‌పై చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read..
Pahalgam | మళ్లీ పెహల్గామ్ బాట పట్టిన పర్యాటకులు.. లోయలో సందడి.. VIDEO
Pahalgam Attackers | జమ్ము కశ్మీర్‌లోనే పెహల్గామ్ ఉగ్రవాదులు..!