Pahalgam | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ (Pahalgam)లో గల మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26 మంది బలయ్యారు. అయితే, ఈ దాడి తర్వాత జనం ఆ ప్లేస్‌కు వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేసినప్పటికీ.. మళ్లీ పెహల్గామ్కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు.
దాడి అనంతరం రెండు మూడు రోజులు నిర్మానుష్యంగా మారిపోయిన పెహల్గామ్ ప్రాంతం.. ప్రస్తుతం టూరిస్ట్‌లతో కళకళలాడుతోంది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు మళ్లీ పెహల్గామ్ బాటపడుతున్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి వ్యాలీని చుట్టేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#WATCH | J&K: Tourists continue to arrive in Pahalgam to enjoy the scenic beauty of the town. pic.twitter.com/9trRznKibH
— ANI (@ANI) May 1, 2025
మరోవైపు కశ్మీర్ లోయలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను మూసివేసింది. లోయలో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా.. అందులో 48 ప్రాంతాలను మూసివేసింది (48 tourist destinations closed). ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన