Alcohol Betting | బెంగళూరు : కర్ణాటకలోని నాగలి ప్రాంతానికి చెందిన కార్తిక్ (21) పందెం కాసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, అతని మిత్రులు సుబ్రమణి, వెంకట రెడ్డి, మరికొందరితో తాను 5 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని చెప్పాడు. దీంతో రెడ్డి స్పందించి, నిరూపిస్తే రూ.10,000 ఇస్తానని సవాల్ చేశాడు. సవాల్‌ను స్వీకరించిన కార్తిక్ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యాడు. దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, రెడ్డి, సుబ్రమణిలను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. కార్తిక్‌కు ఏడాది క్రితం వివాహం అయ్యింది.