Muslim Reservation | న్యూఢిల్లీ: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక సర్కారు నిర్ణయం తీసుకోవటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం అస్థిరంగా, బలహీనంగా కనిపిస్తున్నదని వెల్లడించింది. రిజర్వేషన్ రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌లు కేఎం జోసఫ్, బీవీ నాగరత్న ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించింది.
కర్ణాటక ప్రభుత్వం ఊహాజనిత అంశాల ఆధారంగా దోషపూరిత నిర్ణయం తీసుకుని ఉంటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.