మైనారిటీ వ్యతిరేక చట్టాలు పూర్తిగా ఎత్తివేయాలి
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని క్రైస్తవ, ముస్లిం సామాజిక, ఆధ్యాత్మిక నేతలు శుక్రవారం డిమాండ్ చేశారు. నిర్దిష్ట మైనారిటీ, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్న మతమార్పిడి వ్యతిరేక, పశువధ వ్యతిరేక సహా పలు వివాదాస్పద చట్టాలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. బీజేపీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు రద్దు చేయడంలో జరుగుతున్న జాప్యం మైనారిటీ వర్గాల్లో నిరాశను మరింత పెంచిందని అన్నారు.
- హామీలు మరచిన కాంగ్రెస్
- కర్ణాటకలో మైనారిటీ నాయకుల డిమాండ్
బెంగళూరు, అక్టోబర్ 31: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని క్రైస్తవ, ముస్లిం సామాజిక, ఆధ్యాత్మిక నేతలు శుక్రవారం డిమాండ్ చేశారు. నిర్దిష్ట మైనారిటీ, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్న మతమార్పిడి వ్యతిరేక, పశువధ వ్యతిరేక సహా పలు వివాదాస్పద చట్టాలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. బీజేపీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు రద్దు చేయడంలో జరుగుతున్న జాప్యం మైనారిటీ వర్గాల్లో నిరాశను మరింత పెంచిందని అన్నారు. ఈ మేరకు బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో, కర్ణాటక రాజ్యసభ ముస్లిం ఐక్యవేదిక కన్వీనర్ మహమ్మద్ యహ్య దాముడి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మైనారిటీ వ్యతిరేక చట్టాలను రద్ద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిందని, అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటినా తన వాగ్దానాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదని మచడో విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

