బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు. రేణుక స్వామి హత్య కేసులో వీరికి ఈ ఉపశమనం లభించింది.
పవిత్ర గౌడకు స్వామి అసభ్యకర సందేశాలను పంపించారని నిందితులు ఆరోపిస్తున్నారు. జూన్ 8న స్వామి హత్య జరిగింది. అదే నెల 11న దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ ప్రస్తుతం నడుము నొప్పికి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నిందితులు జైలులో ఉన్నారు.