Nandini Milk | కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై ఏకంగా రూ.4 పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (Karnataka Milk Federation), రైతు సంఘాల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది. కాగా, పాల ధరలను లీటరుపై రూ.5 పెంచాలని ప్రతిపాదన రాగా.. ప్రభుత్వం లీటరుపై 4 పెంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.44గా ఉన్న ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ (most popular blue packet) ధర రూ.48కి పెరగనుంది.
కాగా, నందిని పాల ధరలను కేఎమ్ఎఫ్ ఏటా పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. చివరిసారిగా జూన్ 2024లో నందిని పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు లీటరుపై రూ.2 పెంచింది. అంతకు ముందు జులై 2023లో నందిని పాల ధరలను లీటరుపై రూ.3 పెంచింది. ఇప్పుడే ఏకంగా రూ.4 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
ఇక కాఫీ బ్రూవర్ల సంఘం ఇటీవలే మార్చి నాటికి కాఫీ పౌడర్ ధరలను కిలోకు రూ.200 పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక BMTC బస్సులు, నమ్మ మెట్రో టికెట్ ఛార్జీలు పెరిగాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నీటి సుంకాన్ని పెంచేందుకు పరిశీలన చేస్తోంది. ఇంతలో, విద్యుత్తు వినియోగదారులపై భారం పడనున్నది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి యూనిట్‌కు అదనంగా 36 పైసల చొప్పున సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ(పీ అండ్ జీ) వాటాను విద్యుత్తు వినియోగదారుల నుంచి రాబట్టాలని విద్యుత్తు సరఫరా కంపెనీలను (ఎస్కామ్స్) కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్(కేఈఆర్సీ) ఆదేశించిన దరిమిలా ఈ నిర్ణయం వెలువడింది. ఇలా.. నిత్యావసర వస్తువుల నుంచి నీరు, బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో పాల ధరలు పెంపు మరింత భారం కానుంది.
Also Read..
Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిల్ నిరాకరణ
Visa Appointments | భారతీయులకు షాక్.. భారీగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా
Vladimir Putin | త్వరలో భారత పర్యటనకు పుతిన్.. వెల్లడించిన క్రెమ్లిన్