Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిల్ నిరాకరణ
Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada actor) రన్యా రావు (Ranya Rao)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada actor) రన్యా రావు (Ranya Rao)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో రన్యారావుకు బెంగళూరులోని 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు (64th City Civil and Sessions Court) బెయిల్ నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావు మొదట బెయిల్ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తిరస్కరించడంతో ఆమె ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమె పిటిషన్ తిరస్కరణకు గురైంది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని రన్యారావు న్యాయవాదులు నిర్ణయించారు.
దీంతో ఆమె బెయిల్ కోసం బెంగళూరులోని 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు రెండు రోజుల క్రితం వాదనలు విన్నది. ఈ సందర్భంగా బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా మార్గంలో లావాదేవీలు జరిపిన డబ్బులను ఉపయోగించినట్లు డీఆర్ఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని విచారణ సమయంలోనూ నటి రన్యారావు అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నటితో పాటు డీఆర్ఐ తరఫున వాదనలు విన్న కోర్టు మార్చి 27కి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు నటికి బెయిల్ నికారిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.
మార్చి 3న దుబాయి నుంచి వచ్చిన రన్యారావు నుంచి రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నటిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా.. అధికారులు రూ.2.06కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67కోట్ల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
“Ranaya Rao | కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీఆర్ఐ..!”
“Ranya Rao | ఆమె శరీరమంతా బంగారంతో కప్పేసింది.. రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

