Ranya Rao | ఆమె శరీరమంతా బంగారంతో కప్పేసింది.. రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada actor) రన్యారావు (Ranya Rao)పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి (Kannada actor) రన్యారావు (Ranya Rao)పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో బంగారం దాచి స్మగ్లింగ్ (Gold Smuggling) చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాష్ట్ర మంత్రుల ప్రమేయం కూడా ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
బీజాపూర్ (Bijapur) సిటీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ మాట్లాడుతూ.. ‘ఆమె (రన్యారావు) తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. తన ప్రైవేట్ భాగాల్లో బంగారం దాచి స్మగ్లింగ్ చేసింది. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రుల ప్రమేయం ఉంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాను. రన్యారావుకు ఎయిర్పోర్ట్లో ఎవరు సహకరించారు, బంగారం ఎలా తీసుకొచ్చారు వంటి విషయాలన్నీ శాసనసభ సమావేశాల్లో బహిర్గతం చేస్తాను. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న మంత్రుల బండారం కూడా బయటపెడతాను’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్) అధికారులు లావెల్లె రోడ్లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తాను ఏతప్పూ చేయలేదని.. తప్పుడు కేసులో ఇరికించారంటూ పేర్కొన్నారు. తనను విమానంలోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
Also Read..
యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా రన్యారావు వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

