బెంగళూరు, మార్చి 14: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఆర్థిక నేరాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. ఆమెపై దాఖలైన అభియోగాలు చాలా తీవ్రమైనవని, ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావు మొదట బెయిల్ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
కోర్టు తిరస్కరించడంతో ఆమె ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమె పిటిషన్ తిరస్కరణకు గురైంది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని రన్యారావు న్యాయవాదులు నిర్ణయించారు. మార్చి 4న రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు.