బెంగళూరు: యూట్యూబ్‌లో చూసే బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో, దొరక్కుండా ఎలాంటి టెక్నిక్కులు వాడాలో నేర్చుకున్నానని స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో వెల్లడించింది. మార్చి 1వ తేదీన తనకొక ఫోన్‌కాల్ వచ్చిందని, దుబాయ్ ఎయిర్‌పోర్టులో బంగారం సేకరించి, బెంగళూరులో ఒకరికి అందజేయాలని పేర్కొన్నారని తెలిపింది. యూట్యూబ్ వీడియోలు చూసి బంగారాన్ని రహస్యంగా ఎలా దాచాలో, వాటిని ఎలా స్మగ్లింగ్ చేయాలో తెలుసుకున్నానంది.
అనంతరం దుబాయ్ ఎయిర్‌పోర్టు బయట కత్తెరలు, బ్యాండేజ్‌లు కొనుగోలు చేసి రెస్ట్రూమ్లో బంగారు కడ్డీలను తన ఒంటిపై రహస్యంగా అమర్చానని, తనిఖీల్లో దొరక్కుండా వాటిపై బ్యాండేజ్‌లు కట్టినట్టు వివరించింది. తనకు ఫోన్ చేసిన వ్యక్తి, బంగారం అప్పగించిన వ్యక్తి గురించి తనకు తెలియదని చెప్పింది.