బెంగళూరు, మార్చి 8: కర్ణాటక ప్రభుత్వం విద్యుత్తు బైక్ ట్యాక్సీ సేవలపై ఈ నెల 6 నుంచి నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయని రాష్ట్ర కా్రంగెస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘కొన్ని ప్రైవేట్ యాప్ ఆధారిత కంపెనీలు మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా చూపిస్తున్నాయి’ అని ప్రభుత్వం పేర్కొంది.
తరచూ ఆటోరిక్షాల యజమానులు, డ్రైవర్లతో ‘మ్యాక్సీ క్యాబ్స్’ డ్రైవర్లకు గొడవలు జరిగి కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. బైక్ ట్యాక్సీ ల వల్ల రవాణా శాఖకు పన్ను సేకరణ కష్టంగా మారిందని చెప్పింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.