మాజీ మంత్రి ఈశ్వరప్పకు క్లీన్చిట్
- కర్ణాటక కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో పోలీసుల వెల్లడి
బెంగళూరు, జూలై 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో మాజీ మంత్రిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని పోలీస్ అధికారులు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య వాట్సాప్ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈశ్వరప్పతోపాటు ఆయన అనుచరులు ఇద్దరిపై కేసు నమోదైంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రిపై మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేని కారణంగా ఆయనకు క్లీన్చిట్ ఇచ్చినట్టు తాజాగా తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- karnataka
- KS Eshwarappa
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

