బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, సీఎం సిద్ధరామయ్యను, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని కేరళలోని ఓ ఆలయంలో జంతువుల బలితో కూడిన ‘శత్రు భైరవి యాగం’ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
శత్రువుల సంహారం కోసం దీన్ని చేస్తున్నారని, ఈ యాగంలో భాగంగా పలు జంతువులను కూడా బలి ఇచ్చారని అన్నారు. అయితే కర్ణాటకలోని కొందరు రాజకీయ నాయకులు దీన్ని చేయిస్తున్నారని, ఇందుకోసం కొంత మంది అఘోరాలను కూడా సంప్రదించారని చెప్పారు.