బెంగళూరు: ఇసుక మాఫియా (sand mafia) మరోసారి రెచ్చపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ను లారీతో తొక్కి చంపారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 51 ఏళ్ల మైసూర్ చౌహాన్, నేలగి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం జేవర్గి పరిధిలోని నారాయణపుర గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆ పోలీస్ ప్రయత్నించాడు. అయితే లారీని నిలుపని డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ చౌహాన్ మీదుగా వాహనాన్ని నడిపాడు. దీంతో బైక్‌తో సహా లారీ టైర్ కింద పడిన ఆ పోలీస్ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇసుక లారీ డ్రైవర్ సిద్ధన్నను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
..
కాగా, ఈ షాకింగ్ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీరియస్‌గా స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ చౌహాన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Karnataka | A constable of Nelogi Police Station died on duty while trying to stop a tractor transporting illegally mined sand near Narayanpur in Jewargi taluk of Kalaburagi yesterday. The tractor driver allegedly ran over the police constable. Case registered: Police
State…
— ANI (@ANI) June 16, 2023