Ghar Kab Aaoge | బాలీవుడ్ వెండితెరపై దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన చిత్రం ‘బోర్డర్’. సరిగ్గా 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలోని “సందేశే ఆతే హై.. ఘర్ కబ్ ఆవోగే” పాట వింటే నేటికీ ప్రతి భారతీయుడి కళ్లు చెమర్చుతాయి. అయితే ఇప్పుడు అదే చరిత్రను పునరావృతం చేస్తూ ‘బోర్డర్ 2’ నుంచి ఈ ఐకానిక్ సాంగ్ కొత్త వెర్షన్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సరిహద్దులో విధులు నిర్వహిస్తూ.. కన్నవారికి దూరంగా ఉండే సైనికుల గుండె కోతను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు.
సన్నీ డియోల్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టులో వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ మరియు అహాన్ శెట్టి వంటి యువ తారలు సైనికుల పాత్రల్లో మెరిశారు. ఈ పాటలో వారి నటన చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒరిజినల్ కంపోజిషన్ ఇచ్చిన అను మాలిక్ స్ఫూర్తితో, ఈ కొత్త వెర్షన్ను కూడా ఎంతో ఎమోషనల్గా తీర్చిదిద్దారు. విడుదలైన నిమిషాల్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, మన సైనికుల త్యాగాలకు దేశం ఇచ్చే గౌరవం. ‘బోర్డర్ 2’ ఆ అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తుంది అంటూ దర్శకుడు అనురాగ్ సింగ్ తెలిపారు.