Karnataka : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పుపై గత కొన్నాళ్లుగా సాగిన ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సిద్ధూ క్యాబినెట్లో బెర్తులపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కీలకమైన బెర్తుల కోసం రెండు వర్గాలు మొండిపట్టుతో ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రంగంలోకి దిగాల్సి వచ్చింది.
సీఎం మార్పుపై ఉత్కంఠ వీడటంతో డీకే వర్గం ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కలువకుండా మీరు ఆపుతారా..? అన్న ప్రశ్నకు డీకే బదులిచ్చారు. తాను ఆపనని కరాఖండిగా చెప్పారు. అంతేగాక సీఎం సిద్ధరామయ్యకు గుడ్‌లక్ చెప్పారు. ‘సిద్ధరామయ్య ఐదేళ్లు సీఎంగా కొనసాగాలి, గుడ్‌లక్’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య పార్టీ చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు.
క్యాబినెట్ బెర్తుల విషయంలో కన్ఫ్యూజన్కు తెరదించేందుకు అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఖర్గే బెంగళూరుకు చేరుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.