న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు పొందినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపై వచ్చిన ఆరోపణలను లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.