Karnataka CM : కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) లో అధికార కేంద్రం మారబోతోందని, సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ముఖ్యమంత్రి పదవిని వీడుతారని, ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) సీఎం కాబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి సిద్ధరామయ్య ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు రాయిలా పటిష్టంగా ఉంటుందని ప్రకటించారు.
తనకు, డీకే శివకుమార్‌కు మధ్య చీలికలు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం మైసూరులో డీకే శివకుమార్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ చేయిచేయి కలిపి పైకి లేపి చూపించారు.
#WATCH | Mysuru: Karnataka CM Siddaramaiah and Deputy CM DK Shivakumar address a press conference in Mysuru.
CM Siddaramaiah says, “Our government will last for 5 years like a rock.” pic.twitter.com/JCuwcp43Qb
— ANI (@ANI) June 30, 2025
కాగా, డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం అదే విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండుమూడు నెలల్లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం హైకమాండ్ శివకుమార్ గురించే యోచిస్తోందని అన్నారు.
డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలో అధికార కేంద్రం మార్పు ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు.